వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.!

1001378008.jpg

తెలకపల్లి,నవంబర్ 19: తెలకపల్లి మండల పరిధిలో వ్యవసాయ బోర్లకు సంబంధించిన విద్యుత్ కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం. రమేష్ తెలిపారు.ఎస్సై వివరాల ప్రకారం.. తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన పులిజాల క్రాంతి కుమార్ (23), బారిగారి ధన్‌రాజ్ అలియాస్ దామోదర్ (25), కొనిగారి చందు (25) సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యవసాయ బోర్లకు సంబంధించిన కేబుల్ వైర్లను దొంగిలించి, వాటిని కాల్చి కాపర్ వైర్‌ను వేరు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు.ఈ నెల 17న పర్వతాపూర్ గ్రామ శివారులోని చెరువు సమీపంలో ఉన్న నాలుగు బోర్లకు సంబంధించిన కేబుల్ వైర్లను కట్ చేసి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా లక్నారం గ్రామ శివారులోనూ మరో కేబుల్ వైర్ చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు.గురువారం మండల కేంద్రంలోని పశువుల సంత వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,కాపర్ వైర్లను విక్రయించేందుకు తీసుకెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.వారి వద్ద నుంచి సుమారు 7.1 కిలోల కాపర్ వైర్‌తో పాటు చోరీలకు ఉపయోగించిన హీరో హోండా ద్విచక్ర వాహనం (ఏపీ 22 ఎన్ 0981)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం. రమేష్ వెల్లడించారు.

You may also like...