Author: Gandamalla Kishan

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతి

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 19 :కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పోషకాహార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.‌ ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతి మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం…

వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది..

వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది.. చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు.కట్టంగూర్, సెప్టెంబర్ 24 : అనారోగ్యంలో వస్తే వైద్యం అందాల్సిన అసుపత్రి పరిసరాలు మాత్రం భయానక వాతావరణ కనిపిస్తోంది. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పచ్చని చెట్లు ఉన్నా వాటి చుట్టూ చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పేరుకుపోవడంతో పాములు, దోమలు, విషకీటకాలకు ఆవాసంగా మారింది..మండలంలోని వివిధ గ్రామాల నుంచి అనారోగ్య సమస్యలతో పరువురు అసుపత్రికి వస్తుంటారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వచ్చినప్పుడు…

అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి

అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి త్వరితగతిన సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశంకట్టంగూర్: మండల కేంద్రంలోని అంబటి వాగు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని గురువారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. 359 సర్వే నంబర్‌లో 5.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా దేశ రామాచారి తనకు 30 సంవత్సరాల క్రితం 30 గుంటల భూమికి…

కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు..

కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనంభక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు.. జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 23: కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆయా గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని గణనాథులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఏర్పాటు చేసి…

గణేశుడి లడ్డూ కోసం భక్తుల పోటీ..

గణేశుడి లడ్డూ కోసం భక్తుల పోటీ.. రూ.1.76 లక్షలకు దక్కించుకున్న నాగరాజు, లింగమ్మ దంపతులుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 23: గణనాథుడి లడ్డూ అంటే భక్తులకు ఎంతో ప్రత్యేకం. ఆ లడ్డూను దక్కించుకోవాలనే ఉత్సాహంతో భక్తులు పోటీపడగా చివరకు ఓ దంపతులు అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. కట్టంగూర్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ రాంనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఎరుకల నాగరాజు–లింగమ్మ దంపతులు రూ.1.76 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.వేలం…

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యం

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యంఅయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి . పి. లక్ష్మి సౌజన్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 23 : ఆయుర్వేద వైద్య విధానంతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చికిత్స అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి . పి. లక్ష్మి సౌజన్య అన్నారు. బుధవారం 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని అయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత మెగా వైద్య…

ఐలయ్యా.. నీ ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా?

ఐలయ్యా.. నీ ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా?బీర్ల ఐలయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్‌.. ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌జ్ఞాన తెలంగాణ, నకిరేకల్‌, సెప్టెంబర్‌ 22: రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా ఉన్న బీర్ల ఐలయ్య వందల కోట్లకు ఎలా ఎదిగారో ప్రజలందరికీ తెలుసని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్‌ పట్టణంలోని సువర్ణ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధిని అడ్డుపెట్టుకుని పరిసర…

భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్: వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆకాంక్షించారు. మంగళవారం కట్టంగూర్ మండలం పామనగుండ్లలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బండారు ఆనంద్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో…

మిట్టపల్లి మురళయ్య కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

మిట్టపల్లి మురళయ్య కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 22 : మండల పరిధిలోని దుగినవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మిట్టపల్లి మురళయ్య కు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ల చేతులమీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే…

ధాన్యం కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ వినతి

ధాన్యం కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ వినతి

ధాన్యం కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ వినతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 21 : మండలంలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేసినట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు తెలిపారు. పీఏసీఎస్. ఐకేపీ, ఎన్డీసీఎంఎస్, హాకా ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకాలు, తప్పుడు రికార్డుల నమోదు. రవాణా…