కట్టంగూరు కరువు మండలంగా ప్రకటించాలి : బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్
- కట్టంగూరు కరువు మండలంగా ప్రకటించాలి : బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ - October 30, 2026
- నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి - October 30, 2026
- నీటిని పొదుపుగా వాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్ - October 28, 2026
కట్టంగూరు కరువు మండలంగా ప్రకటించాలి : బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 29 : కరువు పరిస్థితిలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా లో కట్టంగూర్ చోటు కల్పింకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలని గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టంగూర్ మండలంలో వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కట్టంగూర్ ను కరువు మండలంగా పరకటించాలని, నష్టపోయిన రైతులకు ఎకరాలకు రూ.25వేల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఊట్కూరి ఏడుకొండలు, చెరుకు వెంకటాద్రి, శంకర్, చిట్యాల రాజిరెడ్డి, ముప్పిడి యాదయ్య, గుండాల మల్లేష్, రేకల రాజు. శిశుపాల్ రెడ్డి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
