కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 31 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని అన్నారు.శనివారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఎన్డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,461, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని కోరారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ధాన్యం కొనుగోళ్లను చేపడుతోందని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు తమ పంటను విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, నాయకులు పెద్ది సుక్కయ్య, పెద్ది యాదగిరి, బెజవాడ సైదులు, గద్దపాటి దానయ్య, అయితగోని నారాయణ, నూక సైదులు, ముత్యాల లింగయ్య, నంద్యాల వెంకటరెడ్డి, కొండ లింగస్వామి, సర్పంచులు గుల్లి నరేష్, కుంభం అనిల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుండు పరమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

You may also like...