Author: Gandamalla Kishan

వైద్య విద్యార్థుల ఉదారత:

వైద్య విద్యార్థుల ఉదారత: కట్టంగూర్ ఉన్నత పాఠశాలకు వాటర్ కూలర్ బహుకరణజ్ఞాన తెలంగాణ, ​కట్టంగూర్, సెప్టెంబర్ 30: చదువుతో పాటు సామాజిక బాధ్యతను చాటుకుంటూ కామినేని వైద్య కళాశాల ఎంబీబీఎస్ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. కామినేని వైద్య కళాశాల విద్యార్థులు అక్షిత్, అక్షయ్, ధీరజ్, పునీత్, ముఖేష్, వంశీకృష్ణ, రేవంత్, సాత్విక్‌లు బుధవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.13 వేల విలువ చేసి వాటర్ కూలర్ డిస్పెన్సర్‌ను బహూకరించారు. ​ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

ఖమ్మం మహాసభలకు తరలివెళ్లిన ఏఐకేఎంఎస్ శ్రేణులు

ఖమ్మం మహాసభలకు తరలివెళ్లిన ఏఐకేఎంఎస్ శ్రేణులుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 28: ఖమ్మంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభల బహిరంగ సభకు నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు, సంఘం నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకుడు బూరుగు సత్తయ్య మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, కూలీలకు ఉపాధి, కూలి పెంపు, సాగునీరు, పంటల రక్షణ వంటి సమస్యలపై…

జీపీల అభివృద్ధిపై సమన్వయంతో పని చేయాలి : ప్రత్యేక అధికారి సతీష్ కుమార్

జీపీల అభివృద్ధిపై సమన్వయంతో పని చేయాలి : ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 28 : గ్రామపంచాయతీ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మండల ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ అన్నారు. సోమవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రామపంచాతీల అభివృద్ధి. సామర్థ్య వృద్ధి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అధికారులు పూర్తి సమాచారంతో జనరల్ బాడీ సమావేశానికి హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి…

ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ?

ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ?ఓటు హక్కును కాపాడాల్సిన సంస్థే ప్రశ్నార్థకంగా మారడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.గోవాలో 97 మంది ఓటర్ల వ్యవహారంపై సమాధానం చెప్పాలిటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 27 : ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘం పనితీరుపైనే ప్రశ్నలు తలెత్తడం ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఆదివారం నకిరేకల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల…

డీజిల్ దందా గుట్టురట్టు

డీజిల్ దందా గుట్టురట్టుఅయిటిపాములలో 2700 లీటర్ల డీజిల్ పట్టివేత జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 26 : మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఇళ్లతో పాటు హోటల్లో అక్రమంగా డీజిల్ నిల్వ ఉంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు నకిరేకల్, నల్లగొండ సివిల్ సప్లయ్ అధికారులు, కట్టంగూర్ పోలీసులు సంయుక్తంగా శనివారం దాడులు నిర్వహించి సుమారు 2700లీటర్ల డీజిల్ ను సీజ్ చేశారు. హోటల్ యజమాని నారగోని సంధ్యతో పాటు దొమ్మటి మంగమ్మ, నారగోని యాదమ్మలు ఇళ్లలో…

పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి :

పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఎస్. పద్మావతి కట్టంగూర్, జ్ఞాన తెలంగాణ, సెప్టెంబర్ 26 : గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్. పద్మావతి అన్నారు. శనివారం మండలంలోని పిట్టంపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అవగాహన కల్పించారు….

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 26 : మండల కేంద్రమైన కట్టంగూర్ లోని ఎంపీడీఓ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం లో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, త్యాగాలు అమూల్యమైనవని…

ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక

ఉమ్మడి నల్లగొండ జిల్లా  హ్యాండ్ బాల్ జట్ల ఎంపికజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 25 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా అండర్-14,17 బాల, బాలికల హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక పక్రియను శుక్రవారం హెచ్ఎం కందాల రమా సారధ్యంలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చిలుముల సైదులు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి…

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 25 : లోవోల్టేజీ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని  శుక్రవారం కట్టంగూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మండలంలోని పలు గ్రామాల్లో…

రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కు తీవ్ర గాయాలు..

రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కు తీవ్ర గాయాలు..జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 25 : రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కు తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామశివారులో 65 లో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ కు చెందిన ముక్కామల వెంకన్న దుగినవెల్లి గ్రామంలో విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి తిరిగి కట్టంగూర్…