బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలుగా మహేశ్వరి

బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలుగా మహేశ్వరి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 31: బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలుగా మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన గోలి మహేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావిళ్ళ కాశమ్మ శనివారం నియమకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ మహిళ సమస్యల పరిష్కారంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. బాధ్యత అప్పచెప్పిన జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ, సహకరించిన పార్టీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మదుసూధన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.1000399358.jpg

You may also like...