అయిటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి..మరొకరికి తీవ్రగాయాలు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం

అయిటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అక్కడికక్కడే ఇద్దరు మృతి..మరొకరికి తీవ్రగాయాలు

బైక్ పై వెళ్తుండగా ప్రమాదం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 2 : మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో జాతీయ రహదాలపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన జొన్నగడ్డల వాసు(22), అతని సోదరుడు జొన్నగడ్డల ప్రశాంత్ (21)లు గత కొంత కాలంగా హైదరాబాద్ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం వీరు తమ స్వగ్రామం వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. మార్గమధ్యంలోని నార్కట్ పల్లి రాగానే నకిరేకల్ మండల నోముల గ్రామానికి చెందిన గోగుల స్వాతి (30) ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగింది. దీంతో మానవత్వంతో స్పందించిన వారు ఆమెను తమ బైక్ పై ఎక్కించుకుని బయల్దేరారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోని చెర్వుఅన్నారం స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వియవాడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని లారీ ద్విచక్రవాహన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వాసు, స్వాతి రోడ్డుపై పడిపోగా వారిపై నుంచి లారీ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ నడుపుతున్న ప్రశాంత్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహలతో పాటు గాయపడిన ప్రశాంత్ ను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శాలిగౌరారం సీఐ రాజ శేఖర్ సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ దగ్గుల క్రాంతికుమార్ తెలిపారు.

You may also like...