Author: Gandamalla Kishan

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5: అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన కొండ వెంకన్న, పొడిచేటి సైదులు, గుండు రేణుక, పగిళ్ల పద్మ, పోగుల శ్రీనుకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం నకిరేకల్‌లోని తన క్యాంపు…

తాళం వేసిన ఇంట్లో చోరీ….

తాళం వేసిన ఇంట్లో చోరీ….జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5 : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ అయిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూర్ కు చెందిన గీత కార్మికుడు యర్కల పాండు కల్లు గీసేందుకు ఇతర రాష్టం వెళ్లాడు. ఈ నెల 2 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగటగొట్టి బీరువాలో ఉన్న అర తులం బంగారం, 30 తులాల వెంటి పట్టా గొలుసులు…

గురుశిష్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం భాషా బోధనలో విశిష్ట సేవలకు గుర్తింపు

గురుశిష్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంభాషా బోధనలో విశిష్ట సేవలకు గుర్తింపుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5: ఏళ్ల క్రితం గురువు బోధించిన విద్యను ఆదర్శంగా తీసుకున్న శిష్యుడు.. నేడు అదే గురువుతో కలిసి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడం విశేషంగా నిలిచింది. కట్టంగూర్‌కు చెందిన సీనియర్ హిందీ పండితుడు వాలుగొండ నరహరి, తెలుగు పండితుడు పొడిచేటి శంకర్‌కు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు…

చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి  జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్‌ 5: మండలంలోని మునుకుంట్ల గ్రామంలో పెద్ద చెరువు, కోమటికుంట, దబ్బికుంటలకు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ గుల్లి నరేష్ సోమవారం నల్లగొండలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువులు, కుంటల పరిధిలోని భూములను కొందరు రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, పారుదల సక్రమంగా…

గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీ

గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తుల పంపిణీజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : వృద్ధాప్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో, లయన్ గుడిపాటి శివప్రసాద్–పద్మ దంపతుల సహకారంతో శనివారం గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులను గౌరవించడం ప్రతి…

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు.. అయిటిపాములలో విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌ కేంద్రం ప్రారంభం

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు..అయిటిపాములలో విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌ కేంద్రం ప్రారంభంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 4 : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు చదువులో అండగా నిలిచేందుకు అయిటిపాములలో బీఆర్ అంబేద్కర్ విద్యాకేంద్రం ప్రారంభమైంది. సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ట్యూషన్‌ బోధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పాఠశాల అనంతరం అదనపు ట్యూషన్‌…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. లయన్ గుడిపాటి శివప్రసాద్, పద్మ దంపతుల దాతృత్వంతో శుక్రవారం కట్టంగూర్ లో వికలాంగులు, నిరుపేద పిల్లలు, వృద్ధులు కలిపి సుమారు 100 మందికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని నిరుపేదలకు అండగా…

పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన

పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 1 :  మండల కేంద్రంలోని తాగునీటి సమస్య తలెత్తకుండా 11.12 వార్డుల్లో నూతన పైప్ లైన్ నిర్మాణానికి గురువారం సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ పాలక వర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో దశల వారిగా నీటి సమస్యలను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ నినో  ప్రభావంతో మోటర్ల సామర్ధ్యం కొంత మేర తగ్గిందని, ప్రజలు తాగునీటిని పొదుపుగా…

లూజు లైన్లకు చెక్‌.. లో వోల్టేజీకి పరిష్కారం..

లూజు లైన్లకు చెక్‌.. లో వోల్టేజీకి పరిష్కారం..సర్పంచ్‌ శ్యామల చొరవతో కదిలిన విద్యుత్‌ అధికారులు.. ఏడు నూతన స్తంభాల ఏర్పాటుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 1: విద్యుత్‌ లూజు లైన్లు, తరచూ విద్యుత్‌ అంతరాయాలు, లో వోల్టేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కట్టంగూర్‌ మండల కేంద్ర ప్రజలకు ఊరట లభించింది. సమస్యను పలుమార్లు మండల పరిషత్‌ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్థానిక సర్పంచ్‌ ముక్కామల శ్యామల శేఖర్ చొరవతో విద్యుత్‌ అధికారులు స్పందించారు.గురువారం మండల కేంద్రంలో లూజు…

పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలి : తాసీల్దార్ పుష్పలత

పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలి : తాసీల్దార్ పుష్పలతజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 30 :  పౌరహక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం మండలంలోని ఎరసానిగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుకొని సర్పంచ్ అకిటి శంకర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సయన్వయంతో పని చేయాలని సూచించారు. సమస్యలను అధికారులకు దృష్టికి…