ప్రజల అవసరమే లక్ష్యం.. సొంత డబ్బులతో అభివృద్ధికి బాట!
- బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు - November 9, 2026
- ప్రజల అవసరమే లక్ష్యం.. సొంత డబ్బులతో అభివృద్ధికి బాట! - November 9, 2026
- జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక మారుమూల గ్రామం నుంచి ప్రతిభ చాటిన గోపాలకృష్ణ - November 5, 2026
రూ.2 లక్షలతో ఐమాక్స్ లైటు, సీసీ రోడ్డు ఏర్పాటు చేసిన వార్డు సభ్యురాలు ఏకుల సుజాత సైదులు
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 9 : పదవులు అలంకారం కోసం కాదు.. ప్రజలకు సేవ చేయడానికి అని నిరూపించారు కట్టంగూర్ నాలుగో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత సైదులు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తన సొంత డబ్బులతో రూ.2 లక్షలు వెచ్చించి కోట మైసమ్మ ఆలయం సమీపంలో ఐమాక్స్ లైటు, సీసీ రోడ్డు ఏర్పాటు చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. దీపావళి పండుగ వేళ వార్డు ప్రజలకు వెలుగులు, మెరుగైన రహదారి సౌకర్యం అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ పనులను ఆదివారం గ్రామ సర్పంచ్ ముక్కముల శ్యామల శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాత్రివేళ వెలుతురు లేక ఇబ్బందులు పడే ప్రజలకు ఐమాక్స్ లైటు ఉపయోగపడటంతో పాటు, సీసీ రోడ్డు వల్ల రాకపోకలు సులభతరం కానున్నాయన్నారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, ప్రజల అవసరాల కోసం వ్యక్తిగతంగా నిధులు వెచ్చించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లు సుంకరబోయిన నర్సింహ్మ, తరాల బలరాములు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పోగుల నరసింహ, పెద్దిఫౌండేషన్ చైర్మన్ పెద్ది బాల నర్సింహ్మ గౌడ్,, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ అంతటి శ్రీను, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, శ్రీరాం సంధ్య వీరేశం, పులకారం శ్రీను, గట్టిగొర్ల సత్తయ్య, రాచకొండ యాదయ్య, నోముల వెంకటేశ్వర్లు, అంతటి గణేష్, శ్రీపాద రామకృష్ణ, మునుగోటి ఉత్తరయ్య, మేడిమనోజ్, ఊట్కూరి సాయి, పోగుల రామకృష్ణ, నరేష్, శ్రీను, భాను తదితరులు పాల్గొన్నారు.
