జీవో 25ను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదు..
- రక్తదానం ప్రాణదానంతో సమానం : నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి - November 3, 2026
- జీవో 25ను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదు.. - November 3, 2026
- అయిటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి..మరొకరికి తీవ్రగాయాలు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం - November 3, 2026
జీవో 25ను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదు..
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 2: జీవో నెం.25ను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ అన్నారు. సోమవారం కట్టంగూర్‌లో జరుగుతున్న టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ఏడో మహాసభల రెండో రోజు జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతన నిర్వహించిన ప్రతినిధుల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల వంద శాతం హాజరు ఉండాలన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని, విద్యార్థుల హాజరుతోపాటు ఉపాధ్యాయులు బోధన సాగించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. పాఠశాలలకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ స్పర్శ్ నిబంధనల వల్ల వాటిని ఖర్చు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బిల్లుల కోసం ప్రధానోపాధ్యాయులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలలకు నష్టం కలిగిస్తున్న జీవో 25ను రద్దు చేయాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పెరుమాళ్ళ వెంకటేశం, యన్. సోమయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య, ఎఫ్ డబ్ల్యూ ఎస్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు బి. అరుణ, నర్రా శేఖర్ రెడ్డి జిల్లా కోశాధికారి వడ్త్య రాజు, తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, జిల్లా కార్యదర్శులు చిక్కుల రామలింగయ్య, జాల అరుణ, యాట మధుసూదన్ రెడ్డి, రాచమల్ల రమాదేవి, నలపరాజు వెంకన్న, ఏ చిన్న వెంకన్న, కె. కృష్ణారెడ్డి, పగిళ్ల సైదులు, గంటల వెంకటయ్య, కొమరాజు సైదులు, గుండా వేదశ్రీ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మురళయ్య వివిధ కమిటీల కన్వీనర్లు, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
