నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో రెవెన్యూ రీ-సర్వే పనుల పరిశీలన
- నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో రెవెన్యూ రీ-సర్వే పనుల పరిశీలన - October 9, 2026
- రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేపు మహేశ్వరంలో OBC భారీ సభ - October 4, 2026
- లింగారెడ్డి పల్లి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు - October 2, 2026
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రీ-సర్వే లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన లింగారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. చెన్నయ్య గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వేయర్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్వే లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితత్వంతో పని చేయాలని ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసి, రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో వెల్దండ మండల తహశీల్దార్ బిశ్వ కార్తీక్ కుమార్, గిర్దవర్ శంకర్, ఇద్దరు జీపీఓలు, గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య, పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ నేతలు మల్లేపాకుల శేఖర్, లక్ష్మణ్, యువకులు జోగు ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
