నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- జూపల్లి లో ఘనంగా దుర్గ భవాని అమ్మవారి ఆగమనం - October 9, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ పరామర్శ..ఆర్థిక సాయం - October 9, 2026
వెల్దండ అక్టోబర్ 09:నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పనమోని శివ, పూజిత దంపతులు తమ రెండేళ్ల కుమారుడు కౌశిక్‌తో కలిసి పత్తి తీసేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లారు. అక్కడ బాలుడు ఆడుకుంటూ కొంతదూరం వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెతకగా, పొలంలోని నీటి గుంతలో బాలుడు విగతజీవిగా కనిపించాడు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
