కంటి వెలుగులో ప్రజాసేవ – సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ కంటి వైద్య శిబిరం

కడ్తాల్, సెప్టెంబర్ 11: కడ్తాల మండలంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో 6వ ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్య, వైద్య, ఉపాధి రంగాలలో ఎంతోమందికి సేవ చేసే భాగ్యం దక్కిందని అన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, కంటి వైద్య శిబిరాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఆసిఫ్ అలీ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,కడ్తాల సర్పంచ్ బిక్షపతి యాదవ్,నాయకులు చెందోజి, బిక్కు నాయక్, రఘువీర్ రెడ్డి, వెంకటేష్,వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...