ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది

1000203956.jpg

ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన యూనియన్లు విజయం సాధించిన సందర్భంగా జనగామలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్మికులు, యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ డిపోలో ఎన్‌ఎంయూ 59 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, రాష్ట్రస్థాయిలో ఎంప్లాయీస్ యూనియన్ 100 ఓట్ల మెజారిటీ సాధించిందని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంక్షేమం కోసం యూనియన్లు నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.

You may also like...