పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఇందుప్రియ

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన మాజీ కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారం, మహిళా సాధికారతతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యదర్శి పిడుగు మమతతో పాటు నిత్య, గీత, ప్రవళిక, వనిషా, మమత, జ్యోతి పాల్గొన్నారు.

You may also like...