బాన్సువాడ ఆర్టీసీ డిపోలో యూనియన్ ఎన్నికల సందడి
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,అక్టోబర్ 09:
బాన్సువాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ కార్మిక సంఘాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఎంప్లాయిస్ యూనియన్, టీఎస్‌డబ్ల్యూయూ, ఐఎన్‌టీయూసీ, ఎస్‌డబ్ల్యూఎఫ్, బీఎంఎస్, టీఎంయూ తదితర యూనియన్లు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.ఉదయం నుంచే డిపోలో ఎన్నికల సందడి నెలకొనగా, ఉద్యోగులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓట్లు వేశారు.పోలింగ్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 17వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.ఎన్నికల్లో తమ యూనియన్‌కు మద్దతుగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కౌంటింగ్ అనంతరం ఏ యూనియన్ విజయం సాధిస్తుందోనన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.
