ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణం కోసం తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ రూ.50,000 (యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా యువజన అధ్యక్షుడు దేగావత్ జైల్ సింగ్, జిల్లా కాయితీలాభాన్ అధ్యక్షుడు నానక్ సింగ్, పాండు, ఐలాపూర్ ఉపాధ్యక్షుడు సాయిలు, చెన్నం ఉషయ్య, చెన్నం స్వామి, నరేష్, రవి, మల్లేష్, కిషన్, చెన్నం సాయిలు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...