Category: జిల్లా వార్తలు

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఆరుతడి పంటలే మేలు!

ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున యాసంగిలో రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని బాన్సువాడ ఆర్డీఓ అడ్లా రవీందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్‌, మంజీరా జలాలు, చెరువుల నీటిపై ఆధారపడే రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలన్నారు.జొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో అనధికారికంగా మోటార్లు ఏర్పాటు చేసి…

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘సరాకా’ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన.

సరాకా’ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలు

బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలుఆమనగల్లు: ఖానాపూర్‌ పలుగుగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్జాల్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి వాజీద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు నుంచి వెల్జాల్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజీద్‌కు తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వాజీద్‌ను ఎన్నం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడికి సర్పంచ్ పరామర్శ

వెల్దండ:రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెల్దండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బాదేపల్లి రామకృష్ణను స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శుక్రవారం పరామర్శించారు. రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే యెన్నమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రామకృష్ణకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు….

జల్లపల్లిలో ఐకేపీ భవనం ప్రారంభం

 బాన్సువాడ:పోతంగల్ మండలం జల్లపల్లి ఆబాది గ్రామంలో నూతనంగా నిర్మించిన ఐకేపీ మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థిక అభివృద్ధికి ఐకేపీ భవనం ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సుల్తానా గౌస్, సర్పంచ్ బర్మావత్ వివేక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు…

అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం

అమెరికాలో  రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం ​అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు నిర్వహించిన  ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ జానపద సినీ గేయ రచయిత గాయకులు అయిన మిట్టపల్లి సురేందర్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మిట్టపల్లి సురేందర్ దుబాయిలో బతుకమ్మ అనే పాట  ఎడారి బ్రతుకుల కష్టాలను ప్రతిబింబిస్తూ ఆయన అందించిన బతుకమ్మ పాట  విశేష స్పందన తెచ్చుకుంది దానిని గుర్తు చేస్తూ  మర్యాదపూర్వకంగా శాలువలతో స్వాగతం పలికా. ప్రముఖ…

LPL-5 విజేతగా టైగర్ టైటాన్స్

లింగారెడ్డిపల్లి / వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన LPL-5 (లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ – 5వ సీజన్) క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి కిసాన్ సెల్ అధ్యక్షులు మల్లేపల్లి పార్వత్ రెడ్డి గారు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ టోర్నీలో సంతోష్ నాయకత్వంలోని టైగర్ టైటాన్స్ జట్టు ప్రథమ బహుమతిని కైవసం…

జాతీయస్థాయి తంగ్‌-తా పోటీలకు కేజీబీవీ విద్యార్థిని.. సింధు

వెల్లడం అక్టోబర్ 22: వెల్దండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థిని వద్యావత్ సింధు జాతీయస్థాయి తంగ్‌-తా మార్షల్ ఆర్ట్స్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో అండర్‌-17 బాలికల 48 కిలోల విభాగంలో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించింది.ఈ నెల 30న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింధు ప్రాతినిధ్యం వహించనుంది.ఆమె ఎంపికపై మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బిట్టి చంద్రశేఖర్,పాఠశాల ఉపాధ్యాయులు,పీఈటీ మమత,తోటి విద్యార్థులు…

వెల్దండలో ఘనంగా పండుగల సాయన్న జయంతి వేడుకలు

వెల్దండ అక్టోబర్ 22 : వెల్దండ మండల కేంద్రంలో పండుగల సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు, ఉపసర్పంచ్ శ్రీను ముదిరాజ్, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ లింగం తదితరులతో కలిసి సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పండుగల సాయన్న పేద ప్రజల ఆకలి తీర్చిన…