LPL-5 విజేతగా టైగర్ టైటాన్స్
- LPL-5 విజేతగా టైగర్ టైటాన్స్ - October 23, 2026
- కల్వకుర్తిలో రావణ దహన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి – ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు - October 21, 2026
- లింగారెడ్డిపల్లి గ్రామంలో ఆడపడుచుల బతుకమ్మలతో దసరా సంబురాలు - October 21, 2026
లింగారెడ్డిపల్లి / వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన LPL-5 (లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ – 5వ సీజన్) క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి కిసాన్ సెల్ అధ్యక్షులు మల్లేపల్లి పార్వత్ రెడ్డి గారు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ టోర్నీలో సంతోష్ నాయకత్వంలోని టైగర్ టైటాన్స్ జట్టు ప్రథమ బహుమతిని కైవసం చేసుకోగా, శ్రీధర్ నాయకత్వంలోని గోల్డెన్ ఈగల్స్ జట్టు ద్వితీయ బహుమతి పొందింది.
అనంతరం వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అవార్డులు ప్రదానం చేశారు.
• మ్యాన్ ఆఫ్ ది సిరీస్ & బెస్ట్ బ్యాట్స్ మెన్: శ్రీధర్ • బెస్ట్ బౌలర్: అంకిత్ • బెస్ట్ ఫీల్డర్: ఆరిఫ్ • బెస్ట్ కీపర్: అల్లాజి • ఫైనల్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: అనిల్ ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు, గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారు, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు, గ్రామ కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మైల హన్మంత్ రెడ్డి గారు, మైల ఆల్వాల్ రెడ్డి గారు, వార్డు సభ్యులు అకినమోని మల్లేష్ గారు, వట్టెపు అల్లాజి, మహ్మద్ జాంగీర్, మల్లేపాకుల శేఖర్, మల్లేపాకుల భాస్కర్, పబ్బు కాశన్న, పబ్బు శ్రీకాంత్, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టోర్నీ విజయవంతానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారికి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కాయితి ఆశాదీప్ రెడ్డి గారికి, కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారికి, మైల ఆల్వాల్ రెడ్డి, మైల హన్మంత్ రెడ్డి గార్లకు క్రీడాకారులు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు.
