జాతీయస్థాయి తంగ్-తా పోటీలకు కేజీబీవీ విద్యార్థిని.. సింధు
- జాతీయస్థాయి తంగ్-తా పోటీలకు కేజీబీవీ విద్యార్థిని.. సింధు - October 23, 2026
- వెల్దండలో ఘనంగా పండుగల సాయన్న జయంతి వేడుకలు - October 23, 2026
- బొల్లంపల్లి కొత్తచెరువులో మునిగి గొర్రెల కాపరి మృతి - October 22, 2026
వెల్లడం 
అక్టోబర్ 22: వెల్దండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థిని వద్యావత్ సింధు జాతీయస్థాయి తంగ్-తా మార్షల్ ఆర్ట్స్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్లోని షేక్పేట్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో అండర్-17 బాలికల 48 కిలోల విభాగంలో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించింది.ఈ నెల 30న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింధు ప్రాతినిధ్యం వహించనుంది.ఆమె ఎంపికపై మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బిట్టి చంద్రశేఖర్,పాఠశాల ఉపాధ్యాయులు,పీఈటీ మమత,తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
