వెల్దండలో ఘనంగా పండుగల సాయన్న జయంతి వేడుకలు

1001291342.jpg

వెల్దండ అక్టోబర్ 22 : వెల్దండ మండల కేంద్రంలో పండుగల సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు, ఉపసర్పంచ్ శ్రీను ముదిరాజ్, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ లింగం తదితరులతో కలిసి సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పండుగల సాయన్న పేద ప్రజల ఆకలి తీర్చిన గొప్ప మానవతావాది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాసారపు వెంకటయ్య, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్, ముదిగొండ రమేష్, సిరిసనగండ్ల శేఖర్, పిల్లి దేవేందర్, జంగిలి ఆనంద్, బాదేపల్లి రమేష్, రాచూర్ ఉపసర్పంచ్ గణేష్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

You may also like...