Category: జిల్లా వార్తలు

వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డు

వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డు

వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 23: హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా అయ్యప్ప తత్వాన్ని ప్రచారం చేస్తున్న కట్టంగూర్ శ్రీ సాయి మణికంఠ దేవాలయ గురుస్వామి వంగూరి లక్ష్మయ్య (పూల స్వామి) ప్లాటినం ఐకాన్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాదుకు చెందిన ఉజ్వల శిఖరం ఆర్ట్ థియేటర్ సాంస్కృతిక సంస్థ గత తొమ్మిదేళ్లుగా ఆధ్యాత్మిక , కళా రంగాలలో కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను గుర్తించి ప్రతి ఏటా ఐకాన్ అవార్డులను ప్రదానం…

అప్పుల భారం.. ఎండిన వరి పంట.. రైతు ఆత్మహత్య

తాడ్వాయి: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి రమేశ్ (38) తన పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. అప్పుల భారం, ఎండల తీవ్రతకు నీరు అందక వరి పంట ఎండిపోవడం, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న తాడ్వాయి ఎస్సై నరేశ్, ఏఎస్సై కొండల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ముదిరాజ్‌లకు న్యాయం ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత శేఖర్ ముదిరాజ్ ఫైర్.

ముదిరాజ్‌లను వెంటనే బీసీ-డీ (BC-D) కేటగిరీ నుండి బీసీ-ఏ (BC-A) లోకి మారుస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు.

కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం

కామారెడ్డి, అక్టోబర్ 23: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శుక్రవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాటలు, పాటల ద్వారా ప్రయాణికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని, ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్…

పట్టభద్రులంతా ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి.. శ్రీనివాస్ చారి

నాగర్ కర్నూల్ అక్టోబర్ 23 :ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యుడు అందోజు శ్రీనివాస్ చారి కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు.రంగారెడ్డి–మహబూబ్‌నగర్–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం తాజా ఓటరు జాబితాలో చోటు పొందేందుకు ఫారం-18 ద్వారా…

మణికొండలో మితిమీరిన బహిరంగ మద్యపానం..అమృత్ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మణికొండ వాసుల డిమాండ్.

అమృత్ వైన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం స్థానికులకు, వాహనదారులకు శాపంగా మారింది.

రాజధాని రణభేరి సభ, సుర్వేష్ ముదిరాజ్ నేతృత్వంలో భారీగా తరలిన రాజేంద్రనగర్ ప్రజానీకం

రాజేంద్రనగర్ : రాజధాని రణభేరి సభ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకుల మద్దతుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా. తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు నీరుడు సర్వేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, మహిళా నాయకురాలు బోనగిరి ఇంద్ర నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుండి నాయకులు, మహిళలు ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి సుమారు 224 మంది ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లి సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర…

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగిళ్ల శివరాజ్

వెల్దండ అక్టోబర్ 24 :బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బీఆర్ఎస్వీ వెల్దండ మండల అధ్యక్షుడు నాగిళ్ల శివరాజ్ శనివారం తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించినట్లు నాగిళ్ల శివరాజ్ తెలిపారు.

ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు అవగాహన సదస్సు

వెల్దండ: మండలంలో ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన సదస్సును నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యుడు దొబ్బల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పుట్ట రాంరెడ్డి మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నిరంజన్, అశోక్, శేఖర్‌తో పాటు ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ సభ్యులు బండగల్ల చందు, కొమ్ము…

హన్మాజీపేట్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన చాకలి గుమ్మడి కాశీరాం (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పాత చెరువు తూము వద్ద అతడి మృతదేహాన్ని రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామ సర్పంచ్ ఆశగోని లావణ్య వెంకట్ గౌడ్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కాశీరాం మృతికి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…