ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు అవగాహన సదస్సు
- పట్టభద్రులంతా ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి.. శ్రీనివాస్ చారి - October 24, 2026
- కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగిళ్ల శివరాజ్ - October 24, 2026
- ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు అవగాహన సదస్సు - October 24, 2026

వెల్దండ: మండలంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన సదస్సును నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యుడు దొబ్బల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పుట్ట రాంరెడ్డి మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిరంజన్, అశోక్, శేఖర్‌తో పాటు ఆర్ఎస్పీ ఫౌండేషన్ సభ్యులు బండగల్ల చందు, కొమ్ము కిరణ్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
