పట్టభద్రులంతా ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి.. శ్రీనివాస్ చారి

1001294430.jpg

నాగర్ కర్నూల్ అక్టోబర్ 23 :ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యుడు అందోజు శ్రీనివాస్ చారి కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు.రంగారెడ్డి–మహబూబ్‌నగర్–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం తాజా ఓటరు జాబితాలో చోటు పొందేందుకు ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఓటు నమోదు ప్రక్రియకు నవంబర్ 6వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు.అర్హులైన పట్టభద్రులు గడువులోగా దరఖాస్తు చేసుకుని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉండాలని అందోజు శ్రీనివాస్ చారి కోరారు.

You may also like...