మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ కొర్రముల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, యాదవ సంఘం నాయకులు, పెద్దలు, యువకులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవుల ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలకు సదర్ సమ్మేళనం ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో యాదవ సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. యాదవుల ఐక్యతను చాటుతూ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.