రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నేడు భారత కమ్యూనిస్టు పార్టీ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కరువు వల్ల ఉపాధి కోల్పోతున్న మరియు పంట నష్టం తో ఇబ్బంది పడే రైతులను కార్మికులను ఆదుకోవాలనే డిమాండ్ తో నేడు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఎస్ బోస్ గారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ జిల్లాలోని ఐదు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం వల్ల అక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 15 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కరువు వల్ల ఉపాధి కోల్పోయే పట్టణ ప్రాంత కార్మికులకు విభిజి రాంజీ ద్వారా ఉపాధి హామీని కల్పించాలని ,ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులను ప్రజలకు ఉచితంగా అందించాలని, పంట నష్టపోయే రైతులకు కుటుంబానికి 50వేల రూపాయలు తక్షణ సహాయాన్ని ప్రకటించాలని, మంచినీటికి కొరత లేకుండా ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని పిలిచి తీసుకున్నటువంటి అభిప్రాయాలను తక్షణమే అమలు పరచాలని కేవలం సమావేశాలు నిర్వహించి ప్రకటనలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్ని కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ ఎల్ నినో అనే కరువు వల్ల నష్టపోతున్నది పేద, మధ్య తరగతి వరకు ప్రజలేనని కానీ దానికి ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యం అని ఆ పర్యావరణ కాలుష్యానికి మైనింగ్ మరియు అడవుల నరికివేత వల్లే నని అన్నారు. అడవులను నరికివేసి, మైనింగ్ చేసే పెట్టుబడిదారులు అధిక లాభాలు అర్జిస్తూ పర్యావరణ కాలుష్యానికి కారణమై పేద ప్రజలకు నష్టం చేకూరుస్తున్నారని కావున కేంద్ర ప్రభుత్వం పర్యావరణ కాలుష్య కారకులైనటువంటి పెట్టుబడిదారీ వర్గాలపై పన్నులను పెంచి, పేద ప్రజలపై ఉన్న పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నీటి లభ్యత లేని రాష్ట్రాలకు మిగులు ఉన్న రాష్ట్రాల నుండి మంచినీటిని సరఫరా చేసి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణ ప్యాకేజీని ప్రకటించి ప్రజలలో మనోధైర్యాన్ని నింపి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పైనే ఉన్నదని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర వస్తువులను అందించాలని బ్లాక్ మార్కెట్ కి కారణమైనటువంటి నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసి రైతాంగానికి ఉపయోగపడేలా చట్టాలను చేయాలని పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఉపాధి హామీ ద్వారా ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కరువును రాష్ట్ర ప్రభుత్వముల పై వదలకుండా కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా డిప్యూటీ కలెక్టర్ విజయేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
*ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చైతన్య గీతాలను ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డిజి సాయిల్ గౌడ్, కే ఏసురత్నం ,కే ధర్మేంద్ర మరియు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి అన్వర్,జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మి, రచ్చ కిషన్, కృష్ణ, సత్యప్రసాద్ ,వి శ్రీనివాస్, నిమ్మల నరసింహులు మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులు హైమావతి ,మాధవి జిల్లా కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ప్రసాద్, అమరావతి బాబు, యాదగిరి ,దశరథ్, కాసర్ల నాగరాజు, బాపిరాజు , ఈశ్వర్, రాములు గౌడ్, ప్రజానాట్యమండలి అధ్యక్ష కార్యదర్శులు ప్రమీల, వి వెంకటాచారి గౌరవ అధ్యక్షులు ప్రవీణ్ మహిళా సమైక్య నాయకురాలు గిరిజ, మహాలక్ష్మి లతా, నర్సమ్మ, సువర్ణ, కవిత, అనసూయ, జిల్లా పార్టీ నాయకులు వెంకటేష్, బాలరాజు, బాపిరాజు, నాగరాజు, ఇస్తారి, మహేష్, చంద్రయ్య, సత్యనారాయణ, బాబు,సదానందం, అజీమ్, కృష్ణ, నర్సయ్య లతో పాటు వందలాది మంది కార్యకర్తలు హజరయ్యారు.*
