సైబరాబాద్ పరిధిలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవం
- సైబరాబాద్ పరిధిలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవం - November 10, 2026
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు రూ.50 లక్షల విరాళం - November 10, 2026
- పోలీసు కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధి.. - November 10, 2026
మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలో మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం (Women & Children Safety Wing) కోసం ప్రత్యేకంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ భవనంలో షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), భరోసా కేంద్రం, మహిళల అభివృద్ధి, సాధికారత కేంద్రం (CDEW) అనే నాలుగు కీలక విభాగాలను ఒకే చోట ఏర్పాటు చేశారు.
షీ టీమ్స్ మహిళలపై వేధింపులు, ఈవ్టీజింగ్ను అరికట్టేందుకు పనిచేయనుండగా, ఏహెచ్టీయూ అక్రమ రవాణా, దోపిడీ నుంచి మహిళలు, చిన్నారులను రక్షించనుంది. భరోసా కేంద్రం లైంగిక వేధింపులు, దాడులకు గురైన బాధితులకు సమగ్ర సహాయం అందిస్తుంది. సీడీఈడబ్ల్యూ నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా కుటుంబ, వైవాహిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది.
రహేజా గ్రూప్ అందించిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. డైరెక్టర్ శర్వన్ గోనే సహకరించగా, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) పోలీస్ శాఖకు, సంస్థకు మధ్య సమన్వయం చేసింది.
ఈ కార్యక్రమంలో పలువురు డీసీపీలు, పోలీసు అధికారులు, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి. సృజన, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
