ప్రజాసేవలో పడకల్ సర్పంచ్ ముందడుగు.. మండల పరిషత్‌కు రూ.25 వేల ప్రింటర్ అందజేత

1001377126.jpg

తలకొండపల్లి,నవంబర్ 19:తలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయానికి పడకల్ గ్రామ సర్పంచ్ డోకూరి సునీతా ప్రభాకర్ రెడ్డి తన సొంత ఖర్చుతో సుమారు రూ.25 వేల విలువైన ప్రింటర్‌ను బహూకరించారు. బుధవారం ఎంపీడీవో సీతారామమ్మకు ప్రింటర్‌ను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సీతారామమ్మ మాట్లాడుతూ.. మండల పరిషత్ కార్యాలయంలో రోజువారీ పరిపాలనా పనులు, దరఖాస్తులు, రికార్డుల నిర్వహణకు ప్రింటర్ ఎంతో అవసరమని, సర్పంచ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంత ఖర్చుతో అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రింటర్ కార్యాలయ పనులతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.అనంతరం సర్పంచ్ డోకూరి సునీతా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బందికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రింటర్‌ను అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, వార్డు సభ్యులు జోగు విజయ్, బురిగల్ల రమేష్, ఎండీ వాజీద్, నాయకులు జనిగే నరసింహ, చౌటి జగన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...