గ్రామ సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యం -సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్
- వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.! - November 19, 2026
- ఎరవెల్లి ప్రజల పాదయాత్రకు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు.! - November 19, 2026
- జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి - November 19, 2026

వెల్దండ, నవంబర్ 19: మండల కేంద్రంలోని 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ యెన్నం భూపతి రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, సీసీ రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
