Category: జిల్లా వార్తలు

మృతురాలి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత

మాడ్గుల : మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పల్లేటి జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి గారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ…

గ్యార్మీ ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ, అక్టోబర్ 4: వెల్దండ మండలం చేర్కూర్ గ్రామంలో ఎండీ అలీలుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని, ప్రజలందరూ సుఖశాంతులతో, సోదరభావంతో జీవించాలని ఆకాంక్షించారు.కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యం కూడా ఉత్సవాల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, చేర్కూర్…

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు.. అయిటిపాములలో విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌ కేంద్రం ప్రారంభం

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు..అయిటిపాములలో విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌ కేంద్రం ప్రారంభంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 4 : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు చదువులో అండగా నిలిచేందుకు అయిటిపాములలో బీఆర్ అంబేద్కర్ విద్యాకేంద్రం ప్రారంభమైంది. సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ట్యూషన్‌ బోధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పాఠశాల అనంతరం అదనపు ట్యూషన్‌…

బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా మణిందర్‌కు పురస్కారం

వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో మోమిన్ పేట్ మండలం కు చెందిన ఫొటోగ్రాఫర్‌ మణిందర్‌ జిల్లా స్థాయిలో ఉత్తమ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా పురస్కారం అందుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను  శంషాబాద్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శుక్ర ,శనివారo నిర్వహించిన ఎక్స్‌పో భారత్‌ కళా పురస్కార్‌ అవార్డుల వేడుకలలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.   జిల్లా స్థాయిలో గుర్తింపు…

కుల గణనతోనే సామాజిక న్యాయం.. ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్ :దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే కులగణన అత్యంత కీలకమని నాగర్‌కర్నూల్ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ డాక్టర్ మల్లు రవి అన్నారు. జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఎంత జనాభా ఉంటే అంత వాటా అనే భావనకు అనుగుణంగా అణగారిన, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు,…

పరీక్షలా? వేడుకలా? శంకర్‌పల్లి ఎంఈఓ తీరుపై ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి, అక్టోబర్ 04:శంకర్‌పల్లి మండలంలో SA-1 పరీక్షలు కొనసాగుతున్న సమయంలో రేపు నిర్వహించనున్న మండలస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ, బాహ్య మూల్యాంకనం వంటి కీలక విద్యా ప్రక్రియలు కొనసాగుతున్న సమయంలో కార్యక్రమాన్ని...

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్

కల్వకుర్తి: కల్వకుర్తి మున్సిపాలిటీ, తిలక్ నగర్ (3వ వార్డు)కు చెందిన వారణాసి రామకృష్ణ అకాల మరణం చెందడం జరిగింది.ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ అధ్యక్షులు బావండ్ల మధు,కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు ,3వ…

బ్రిడ్జిపై గుంత.. అధికారుల నిర్లక్ష్యం!

దేవరుప్పుల మండల కేంద్రంలోని వాగుపై ఉన్న మెయిన్‌ బ్రిడ్జి మొదటి భాగంలో ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారుతోంది. గుంత ఏర్పడి చాలా నెలలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ మార్గంలో గుంత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజల భద్రత, ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి బ్రిడ్జిపై ఉన్న గుంతను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు…

అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు:

అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న శ్రీ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జిల్లా కలెక్టర్ మరియు యస్ పి ప్రమాదం జరిగినందుకు ప్రగాఢ సానుభుని తెలిపారు, అలాగే క్షిత గాత్రులు మొత్తం 51 మంది ఉండవచ్చును అందులో చనిపోయినవారు (4) నలుగురు వ్యక్తులు మరణించారు వీరియొక్క కుటుంబీకులకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం తో మాట్లాడి ఇప్పిస్తాము మరియు మిగతా క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున ఇప్పిస్తామని తెలిపారు, అదేవిదంగా బస్సు బోల్తా పాడినప్పుడు…