చదువుకు పేదరికం అడ్డుకాకూడదు.. అయిటిపాములలో విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌ కేంద్రం ప్రారంభం

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు..


అయిటిపాములలో విద్యార్థులకు 
ఉచిత ట్యూషన్‌ కేంద్రం ప్రారంభం
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 4 : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు చదువులో అండగా నిలిచేందుకు అయిటిపాములలో బీఆర్ అంబేద్కర్ విద్యాకేంద్రం ప్రారంభమైంది. సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ట్యూషన్‌ బోధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పాఠశాల అనంతరం అదనపు ట్యూషన్‌ కోసం పట్టణాలకు వెళ్లే స్థోమత లేని విద్యార్థులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు కూడా మెరుగైన విద్యను అందుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కల్పించడమే మా లక్ష్యమన్నారు. విద్యార్థి బాగా చదివి తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఆ కుటుంబానికే కాదని మొత్తం గ్రామానికి గర్వకారమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా కేంద్రానికి పంపించి చదువుపై ఆసక్తి పెంచాలని వారు కోరారు. సావిత్రీబాయి పూలే విద్య కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ విద్యార్థులకు విద్యా అవకాశాలను మరింత చేరువ చేయాలన్న సంకల్పంతో ట్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు చిలుముల వంశీ, ఉపాధ్యక్షుడు వంటేపాక కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి గురువీర్, కోశాధికారి సిహెచ్ పవన్, గౌరవ సలహాదారులు పల్లె మహిపాల్, బొజ్జ సంధ్యారాణి, బర్రె సైదులు, నకిరేకంటి శ్రీనివాస్, తోటకూరి సైదులు, తాటిపాముల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు పూర్ణకంటి లక్ష్మణ్, బొజ్జ సురేష్, బర్రె సాయి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...