బాలయ్య మృతి బాధాకరం.. గోలి శ్రీనివాస్ రెడ్డి
- ఆమనగల్లులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన - October 4, 2026
- కొట్రలో ఐదు కుటుంబాలకు ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత.. సిమెంట్ అందజేత - October 4, 2026
- మృతురాలి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత - October 4, 2026
వెల్దండ 
వెల్దండ: మండలంలోని చేర్కూర్ గ్రామానికి చెందిన పబ్బు బాలయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలయ్య మృతి విషయం తెలుసుకున్న ఆయన చేర్కూర్ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, తనవంతు సహాయంగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఉన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, చేర్కూర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ రామచంద్రయ్య, మాజీ ఎంపీటీసీలు భీమయ్య గౌడ్, జ్యోతి నిరంజన్, చందు నాయక్, మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోగయ్య, మాజీ సర్పంచులు అంజి నాయక్, శంకర్ నాయక్, డీలర్ మైసయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య,ఉపసర్పంచ్ కొండల్, మాజీ ఉపసర్పంచులు నరసింహ ముదిరాజ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
