మృతురాలి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026
మాడ్గుల : మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పల్లేటి జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి గారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లేటి జంగయ్య వార్డ్ మెంబర్ లక్ష్మీ శ్రీశైలం పల్లేటి చంద్రయ్య చాట్ల యాదగిరి చాట్ల రాములు చాట్ల జంగయ్య పల్లె రమేష్ పులికంటి ముత్యాలు మాజీ వార్డ్ మెంబర్ పులికంటి మహేష్ చాట్ల దశరథ చాట్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
