పరీక్షలా? వేడుకలా? శంకర్పల్లి ఎంఈఓ తీరుపై ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం
- ఉపాధ్యాయుల అభిప్రాయాలకు తలొగ్గిన ఎంఈఓ.. రేపటి సమావేశం 4 గంటలకు పొడిగింపు - October 4, 2026
- పరీక్షలా? వేడుకలా? శంకర్పల్లి ఎంఈఓ తీరుపై ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం - October 4, 2026
- రేషన్ కార్డుదారులకు కేంద్రం షాక్ ఆరు నెలలు వాడని కార్డులు బంద్.. - October 4, 2026

- రేపటి కార్యక్రమాన్ని తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్
- SA-1 పరీక్షల మధ్య కార్యక్రమం నిర్వహణపై అభ్యంతరాలు
- ఎంఈఓ ఆదేశాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతున్న ఉపాధ్యాయులు
- విద్యార్థుల పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి ప్రతినిధి, అక్టోబర్ 04:
శంకర్పల్లి మండలంలో SA-1 పరీక్షలు కొనసాగుతున్న సమయంలో రేపు నిర్వహించనున్న మండలస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ, బాహ్య మూల్యాంకనం వంటి కీలక విద్యా ప్రక్రియలు కొనసాగుతున్న సమయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు మణి గార్డెన్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించేందుకు ఎంఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో పాఠశాలల్లో SA-1 పరీక్షలు కొనసాగుతుండటంతో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణపై స్పష్టత అవసరమని వారు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా కార్యక్రమానికి మొదట అందరూ హాజరు కావాలనే విధంగా సమాచారం వెళ్లి, అనంతరం కొందరు ఉపాధ్యాయులు మాత్రమే వస్తారని వివరణ ఇవ్వడంపై కూడా ఉపాధ్యాయులు ప్రశ్నలు సంధిస్తున్నారు. “అసలు తుది ఆదేశం ఏమిటి? పరీక్షల సమయంలో ఉపాధ్యాయుల విధులు ఎలా నిర్వహించాలి? కార్యక్రమానికి ఎవరు హాజరు కావాలి?” అనే అంశాలపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై ఎంఈఓను వెంటనే తొలగించాలని కొందరు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంఈఓ నిర్ణయాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించి, వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. పరీక్షల సమయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యార్థులకు లేదా పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలిగిందా? అధికారిక ఆదేశాలు ఎందుకు మారాయి? అనే అంశాలపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం పట్ల అభ్యంతరం లేదని, అయితే విద్యార్థుల పరీక్షల కంటే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించే పరిస్థితి ఏర్పడకూడదని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా పరీక్షల నిర్వహణకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చి, అనంతరం కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
“కార్యక్రమం కంటే విద్యార్థుల పరీక్షలే ముఖ్యం. అధికారుల నిర్ణయాల్లో స్పష్టత, బాధ్యత ఉండాలి. రేపటి కార్యక్రమాన్ని నిలిపివేసి, ఎంఈఓ వ్యవహారశైలిపై విచారణ జరపాలి” అని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరీక్షల వివరాలు :

మండల విద్యాధికారి జారీచేసిన సర్క్యులర్

