కుల గణనతోనే సామాజిక న్యాయం.. ఎంపీ మల్లు రవి

1001235777.jpg

నాగర్ కర్నూల్ :దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే కులగణన అత్యంత కీలకమని నాగర్‌కర్నూల్ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ డాక్టర్ మల్లు రవి అన్నారు. జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఎంత జనాభా ఉంటే అంత వాటా అనే భావనకు అనుగుణంగా అణగారిన, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్నదే రాహుల్ గాంధీ కులగణన డిమాండ్‌లో ప్రధాన ఉద్దేశమని తెలిపారు.కులగణన కేవలం జనాభా లెక్కింపు మాత్రమే కాదని, వివిధ సామాజిక వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను అర్థం చేసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుందని అన్నారు. ఈ సమాచారంతో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ తన విధానపరమైన వైఖరిని కొనసాగిస్తోందని తెలిపారు.

You may also like...