గ్యార్మీ ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

1001234957.jpg

వెల్దండ, అక్టోబర్ 4: వెల్దండ మండలం చేర్కూర్ గ్రామంలో ఎండీ అలీలుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని, ప్రజలందరూ సుఖశాంతులతో, సోదరభావంతో జీవించాలని ఆకాంక్షించారు.కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యం కూడా ఉత్సవాల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, చేర్కూర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ రామచంద్రయ్య, మాజీ ఎంపీటీసీలు భీమయ్య గౌడ్, జ్యోతి నిరంజన్, చందు నాయక్, మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోగయ్య, మాజీ సర్పంచులు అంజి నాయక్, శంకర్ నాయక్, డీలర్ మైసయ్య, ఉపసర్పంచ్ కొండల్, మాజీ ఉపసర్పంచులు నరసింహ ముదిరాజ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

You may also like...