Author: PAKADI RAMANJANEYULU

వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు

వెల్దండ: వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో వివిధ ఘటనలకు సంబంధించి మూడు కేసులు నమోదైనట్లు ఎస్సై యుగేందర్ రెడ్డి తెలిపారు.ఇంట్లో చోరీ: గాజులోని భావితండాకు చెందిన వద్యావత్ దేవేందర్ తన పొలం వద్ద పనిచేసేందుకు 15 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన హేమంత్‌ను పనిలో పెట్టుకున్నాడు.దేవేందర్ దంపతులు కల్వకుర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువా తెరిచి ఉండటాన్ని గుర్తించారు. అందులోని రూ.50 వేల నగదు, సుమారు ఐదు గ్రాముల బంగారు కమ్మలు కనిపించలేదు. హేమంత్ కూడా…

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా.. విషాదంలో ఊతకర్రలా..ఉప్పల

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసాకల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని బెక్కర గ్రామం దార ఎల్లమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేంరెడ్డి శేఖర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ దార వెంకటయ్య,గోరటి ఉషన్న, ప్రభాకర్…

పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎలుమ ఫంక్షన్ హాల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సి కూచుకుల్ల దామోదర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ హేమంత కేశవ్ పాటిల్,మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర ,ఎమ్మార్వో తబితా రాణి గారు , ఆర్డీవో అర్చన,కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారులు,తదితరులు హాజరయ్యారు.అలాగే జిల్లా డీసీసీ కార్యదర్శి కొత్త శ్రీనివాసులు,పొడుగు శ్రీనివాసులు పాల్గొన్నారు.13వ వార్డు మరియు 2వ వార్డుకు చెందిన…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి ఘన సన్మానం

కల్వకుర్తి :మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన సామ రామ్మోహన్ రెడ్డిని నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఎలిగొండ మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.హైదరాబాదులోని తన నివాసంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం పట్టభద్రుల ఎలక్షన్ మెంబర్ షిప్ గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టసభల్లో రామ్మోహన్ రెడ్డి లాంటి వక్త ఉండటం నేటి సమాజానికి చాలా అవసరమని అన్నారు. పట్టబద్రులందరూ సమ…

సేవాసంకల్ అభియాన్ లో.. అంగం మిలాన్ సేవా

లింగాల అక్టోబర్ 1: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మండలంలోని అంబటి పల్లి గ్రామంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రజలకు చేరువగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ,సమాజంలో సేవాభావాన్ని మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.లింగాల మండల అధ్యక్షుల గువ్వాని నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ తేజస్విని,జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నిషాద ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబటి పల్లి గ్రామ సర్పంచ్ జంబులా…

వీజీ – బీలో పోలెపల్లి గ్రామ ముఖచిత్రం ఆవిష్కరణ

ఆమనగల్లు: మండలంలోని పోలేపల్లి గ్రామపంచాయతీలో విజి-బి గ్రామ కార్యక్రమంలో భాగంగా గ్రామ ముఖచిత్రం, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను చిత్రపటాల ద్వారా కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. గ్రామంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.గ్రామంలోని ప్రధాన రహదారులైన ఆమనగల్లు రోడ్డు, వెల్దండ రోడ్డుతో పాటు రైతు వేదిక, ప్రాథమికోన్నత పాఠశాల భవనం, గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులను చిత్రపటాల్లో పొందుపరిచారు.అలాగే గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం, ఈదమ్మ తల్లి దేవాలయం, పోచమ్మ దేవాలయం, మైసమ్మ దేవాలయం,…

అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంగిల్ సఫారీ పున ప్రారంభం

అమ్రాబాద్:నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మూడు నెలల విరామం తర్వాత జంగిల్ సఫారీ తిరిగిప్రారంభమైంది.వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం దృష్ట్యా ప్రతి ఏటా జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీని అటవీ శాఖ నిలిపివేస్తుంది.ఈ మూడు నెలల పాటు అడవిలో జంతువుల స్వేచ్ఛా విహారానికి, ప్రశాంతతకు భంగం కలగకుండా పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించారు.ఈ గడువు ముగియడంతో అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ యష్ ప్రకాష్ సింగల్ సఫారీని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు…

ఎస్సైగా పదోన్నతి పొందిన శ్రీనివాసులుకు సర్పంచ్ గణ సన్మానం

వెల్దండ: ఎస్ఐగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తున్న శ్రీనివాసులను వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.విధి నిర్వహణలో శ్రీనివాసులు చూపిన అంకితభావం, బాధ్యతాయుత సేవలను సర్పంచ్ కొనియాడారు.పదోన్నతితో మరింత ఉన్నత స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు పురుషోత్త చారి, నాయకులు ఎండి రషీద్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, మరియు పలువురు…

వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు వెల్దండ: వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మూతిలాల్ నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భరత్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్…