Author: PAKADI RAMANJANEYULU

కల్వకుర్తిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమి పూజ

కల్వకుర్తిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమిపూజకల్వకుర్తి: పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రూ.50 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో చేపట్టనున్న విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 2న శుక్రవారం ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్, వైస్…

మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక చేయూత

వెల్దండ :వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సమకూర్చిన రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.అలాగే మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ రూ.2 వేలు, మాజీ ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య రూ.2 వేలు, బీఆర్ఎస్ నాయకుడు…

చలో వెల్దండ ర్యాలీని విజయవంతం చేయాలి.. జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాదిగ

వెల్దండ: ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించి, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేసింది. అక్టోబర్‌ 11న నిర్వహించనున్న ‘చలో వెల్దండ’ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌–టీఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రామాంజనేయులు మాదిగ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని మండల, తాలూకా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు కేదాస్‌ మోహన్‌ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డాక్టర్‌ అంబేద్కర్‌…

కొట్లలో స్వచ్చ జల ధార..ఆరు తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత

వెల్దండ, సెప్టెంబర్ 30:ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కొట్ర గ్రామంలోని ఆరు తాగునీటి నిల్వ ట్యాంకులను ప్రత్యేక యంత్రాల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరిచారు.ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా మార్చారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం,సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.గ్రామ అవసరాలను గుర్తించి నిరంతరం…

ఎమ్మెల్యే కసిరెడ్డి హామీతో కోర్టు కేసు ఉపసంహరణ

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని చిరు వ్యాపారులందరు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీతో కేసును ఉపసంహరించుకున్నారు.బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శివలింగం,మున్సిపల్‌ చైర్మన్‌ పత్యనాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ కోర్టు కేసును ఎమ్మెల్యే హామీతో చిరు వ్యాపారులందరూ కలిసి ఉపసంహరించుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు చిరు వ్యాపారులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా…

వెల్దండలో అక్రమ మద్యం తయారీ పై పోలీసుల సంయుక్త దాడులు

వెల్దండ సెప్టెంబర్ 30:వెల్దండ మండలంలో అక్రమ మద్యం తయారీపై ఎక్సైజ్‌, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించారు.పోచమ్మగడ్డ తండా, సిలోనిబావి తండా ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తయారు చేస్తున్న 1,450 లీటర్ల ఎఫ్‌జే వాష్‌ను ధ్వంసం చేశారు. అలాగే 10 లీటర్ల ఐడీ లిక్కర్‌, 480 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.అక్రమ మద్యం తయారీకి సంబంధించి ఒకరిని అరెస్టు చేసి ఆరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.డిప్యూటీ కమిషనర్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌,…

రాచూర్ లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

వెల్దండ సెప్టెంబర్ 30: వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఉపసర్పంచ్ గణేష్ పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్య విషయాల పట్ల మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జ్వరం జలుబు దగ్గు తదితర వచ్చినట్లయితే వెంటనే గ్రామంలోని ఆశా కార్యకర్తలు సాంప్రదించి ప్రభుత్వం నుండి వచ్చిన ఉచిత మందులు తీసుకోవాలని సూచించారు అనంతరం మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పంచాయతీ…

గ్యాస్ వినియోగదారులకు నేటితో ఈ కేవైసీ గడువు

నాగర్‌కర్నూల్: గ్యాస్ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లకు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అరికట్టడంతో పాటు ప్రభుత్వ రాయితీల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ–కేవైసీ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను పొందాలంటే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసి ఈ–కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఏడాదికి పైగా బయోమెట్రిక్ ఈ–కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా 100 శాతం పూర్తికాలేదన్నారు. అక్టోబర్‌ 1 వరకు తుది…