ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: పత్యా నాయక్ - November 17, 2026
- రైతులకు శుభవార్త మూడు గ్రామాలకు కొత్త పీఏసీఎస్‌లు.. ప్రభుత్వ అనుమతి! - November 17, 2026
- ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై కలెక్టర్ ఫోకస్..పంజుగుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.! - November 17, 2026

కల్వకుర్తి: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (రిటైర్డ్ ఐపీఎస్), బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఎల్-1 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల వెంకటేష్ సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బావండ్ల మధు, కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, మాజీ మున్సిపల్ స్పెషల్ నాలెడ్జ్ పర్సన్ కుడుముల మనోహర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దాచేపల్లి శ్రీనివాసులు, గంధం కిరణ్ ప్రసాద్, గంప శ్రీనివాసులు, పూరి రమేష్, దారమోని గణేష్, గండికోట రాజు, పాండు గౌడ్, మేకల శ్రీనివాసులు పాల్గొన్నారు.టోర్నమెంట్ నిర్వాహకులు బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు వట్టేపు కిషోర్, నరేష్, దుబ్బ నాగేష్, అనిల్‌తో పాటు ఆర్ఎస్పీ ఫౌండేషన్ సభ్యులు అశ్విన్, కిరణ్, రాము తదితరులు పాల్గొన్నారు.
