బీఆర్ఎస్ లోకి గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేరికకు.. అనుచరులతో సన్నాహాలు.!
- సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: పత్యా నాయక్ - November 17, 2026
- రైతులకు శుభవార్త మూడు గ్రామాలకు కొత్త పీఏసీఎస్‌లు.. ప్రభుత్వ అనుమతి! - November 17, 2026
- ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై కలెక్టర్ ఫోకస్..పంజుగుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.! - November 17, 2026

కల్వకుర్తి నవంబర్ 17:గిరిజన సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వీ. హన్మ నాయక్ తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరికపై చర్చించారు.ఈ సందర్భంగా ఎడ్మ సత్యం వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కడ్తాల్ మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ చేసిన కృషిని అభినందించారు. త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపి, కల్వకుర్తి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అనుచరుల సమక్షంలో పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.
