అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు: ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
- సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: పత్యా నాయక్ - November 17, 2026
- రైతులకు శుభవార్త మూడు గ్రామాలకు కొత్త పీఏసీఎస్‌లు.. ప్రభుత్వ అనుమతి! - November 17, 2026
- ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై కలెక్టర్ ఫోకస్..పంజుగుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.! - November 17, 2026

నాగర్‌కర్నూల్ నవంబర్ 17 :నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ మండలంలోని సాయి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చేయూత పింఛన్ల పథకంలో భాగంగా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు కూడా మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన వారైనా అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
