పత్తి పంట నాశనానికి కుట్ర.. దాయాదుల ఆరోపణలు.!

1001368442.jpg

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 16:కురుమిద్ద గ్రామంలోని వారసత్వ భూ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తమ పత్తి పంటను నాశనం చేసేందుకు శీను,మల్లేష్ ప్రయత్నిస్తున్నారని దాయాదులు సుల్తాన్,భాస్కర్, సాయి, బాలస్వామి, వెంకటయ్య ఆరోపించారు. ఈ మేరకు ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు.సర్వే నంబర్లు 140,136/ఆ/ఆఇ1లో భూమికి సంబంధించి కోర్టులో వివాదం కొనసాగుతోందని, వరి కోత యంత్రాన్ని తమ పత్తి పంట మీదుగా తీసుకెళ్లి పంటను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము వరి కోతకు అడ్డుపడుతున్నామంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కోర్టు పరిధిలో ఉన్న వివాదంపై ఇరువర్గాల వాదనలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలని మీడియాను కోరారు.తమకు,తమ పంటకు రక్షణ కల్పించాలని కోరుతూ త్వరలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.

You may also like...