నూతన వధూవరులను ఆశీర్వదించిన.. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

1001385626.jpg

వెల్దండ,నవంబర్ 21:వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బాలస్వామి గౌడ్ సోదరుడు రఘు గౌడ్ వివాహ వేడుకలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్‌పర్సన్ రజిని సాయిచంద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్టా రాంరెడ్డి, అఖిల భారత కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడు చిన్న జంగయ్య యాదవ్, యువ నాయకులు అంజి మాస్టర్, జక్కుల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...