డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలి.. ఆర్డీవోకు వినతిపత్రం
- ప్రమాదంలో గాయపడిన లాలూ నాయక్‌కు భూపతిరెడ్డి పరామర్శ - November 21, 2026
- ముదిరాజుల ఐక్యతతోనే హక్కులు సాధ్యం:నూకం వెంకటయ్య - November 21, 2026
- చెదురుపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - November 21, 2026

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,నవంబర్ 20: డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఎర్రవల్లి గ్రామాల ఉనికిని కాపాడాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.పాత గోకారం గ్రామాన్ని యథావిధిగా పునర్నిర్మించాలని, ఆర్ అండ్ ఆర్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. గత 11 నెలలుగా సుమారు 354 రోజుల నుంచి శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు, జీవనాధారాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.పాదయాత్రను ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ జి. రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సోషల్ యాక్టివిస్ట్ చీమర్ల అర్జున్ రెడ్డి, తాండ్ర సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్, చెన్నకిష్టన్న, హనీఫ్, కనుగుల జంగయ్య, వీరాస్వామి, కాంగ్రెస్ నాయకుడు జమ్ముల శ్రీకాంత్, కౌన్సిలర్ వంశీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
