ఆహార శుద్ధి కర్మాగారానికి భూమిపూజ.. ముఖ్యఅతిథిగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

1001381860.jpg

తలకొండపల్లి,నవంబర్ 20: మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పడకల్ గేట్ వద్ద మహీధర రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆహార శుద్ధి కర్మాగార భవన సముదాయానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారితో కలిసి పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. రైతుల ఉత్పత్తులకు విలువ జోడించి, ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా రైతులకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించవచ్చని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...