ప్రమాదంలో గాయపడిన లాలూ నాయక్‌కు భూపతిరెడ్డి పరామర్శ
- ప్రమాదంలో గాయపడిన లాలూ నాయక్‌కు భూపతిరెడ్డి పరామర్శ - November 21, 2026
- ముదిరాజుల ఐక్యతతోనే హక్కులు సాధ్యం:నూకం వెంకటయ్య - November 21, 2026
- చెదురుపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - November 21, 2026

వెల్దండ నవంబర్ 21:వెల్దండ మండలంలోని నగరగడ్డ తండాకు చెందిన సింగిల్ విండో డైరెక్టర్ లాలూ నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ శనివారం ఆసుపత్రికి వెళ్లి లాలూ నాయక్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
