వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా అరెకంటి శివప్రసాద్ నియామకం

1001382298.jpg

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా జూపల్లి గ్రామానికి చెందిన అరెకంటి శివప్రసాద్ తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వార్డు సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గౌరవం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఫోరం బలోపేతానికి, గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

You may also like...