Author: Gandamalla Kishan

కట్టంగూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 23 : కట్టంగూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ లోని వివిధ రికార్డులు, పరిసరాలను పరిశీలించి మండలంలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పోలీసుల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు సత్వరమే స్పందించి పరిష్కరించాలని…

వైభవంగా తులసి దామోదర కళ్యాణం వార్షిక ఏకాదశి పూర్ణాహుతి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూరు నవంబర్ 21 : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో తులసి కళ్యాణం, కార్తీక దామోదర పూజా, వార్షిక ఏకాదశి మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్న తృతీయ వార్షిక ఏకాదశి హోమం పూర్ణాహుతి ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ, రామడుగు అశ్విన్ శర్మ ఆధ్వర్యంలో తులసి కళ్యాణం, కార్తీక దామోదర పూజలలో…

ఎమ్మెల్యే వీరేశంపై విమర్శలు సహించేది లేదు : కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 21: ఎమ్మెల్యే వేముల వీరేశంపై మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకుడు సుంకరబోయిన నర్సింహ్మ పదేపదే విమర్శలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య హెచ్చరించారు. పార్టీకి ఎవరు ద్రోహం చేశారో, గతంలో ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

వలసలు నివారించడమే లక్ష్యం : ఏపీఓ కడెం రామ్మోహన్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 20: ఎల్‌నినో ప్రభావంతో కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే పనులు కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతున్నట్లు ఏపీఓ కడెం రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని మునుకుంట్ల గ్రామంలో కోమటికుంటలో జరుగుతున్న ఉపాధి హామీ (వీబీ జీరాంజీ) పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు, పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం…

మల్టీపర్పస్ సిబ్బందికి జీవిత బీమా భరోసా : కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 19 : గ్రామపంచాయతీలో పని చేస్తున్న మల్టీపర్పస్ సిబ్బందికి జీవిత బీమా ఎంతో భరోసా ఇస్తుందని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. పంచాయతీరాజ్ ఆదేశాల గురువారం జీపీ నిధుల నుంచి ఒక్కొక్కరికి రూ.755 ప్రీమియం చెల్లించి 20 మంది సిబ్బందికి రూ.15లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా అట్టి బీమా పత్రాలను సిబ్బందికి అందజేసి మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణలో నిరంతరం…

నడవలేని స్థితిలోనూ పింఛన్ కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా మంచానికే పరిమితం.. నాలుగుసార్లు సదరం క్యాంపునకు వెళ్లినా ఫలితం శూన్యం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 18 : ఒకప్పుడు సుతారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించిన గోగు యాదయ్య.. విధి చిన్నచూపుతో ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. మండల కేంద్రంలోని శ్రీరాంనగర్‌కు చెందిన యాదయ్యకు ఉన్నట్టుండి కాళ్లు, నడుము చచ్చుపడిపోవడంతో నడవలేని దుస్థితి ఏర్పడింది. కనీసం మూత్ర, మల విసర్జనకు కూడా పాకుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక స్థోమత లేక మెరుగైన వైద్యం చేయించుకోలేకపోయిన యాదయ్య.. తనకు వికలాంగ పింఛన్ వస్తే ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని…

సంక్షేమ పథకాల పంపిణీలో రాజకీయం చేయడం తగదు : కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 18 : ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల పంపిణీలో కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల రాజకీయాలు చేయడం సరికాదని కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు ఆరోపించారు. కట్టంగూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులతో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కట్టంగూర్ ఎంపిడీఓ కార్యాలయంలో మంగళవారం పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా సర్పంచ్ వ్యవహరించిన తీరు సబబుగా లేదన్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో సర్పంచ్…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం : విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 17 : అర్హులైన పేదలకు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గౌడ, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిండమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం అన్నారు. మండలానికి మంజూరైన 1141 నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పింఛన్లు కేవలం ఆర్థికసాయం మాత్రమే కాదని, నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అండగా…

సొంత పార్టీ సర్పంచ్‌కే గుర్తింపు కరువా?

కట్టంగూర్ పింఛన్ల పంపిణీలో వివాదం అధికార పార్టీ కి చెందిన కట్టంగూర్ సర్పంచ్‌ శ్యామలకు చేదు అనుభవం ఉప సర్పంచ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై చర్చజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 17: అధికార పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌కే ప్రభుత్వ కార్యక్రమంలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం కట్టంగూర్ లో చర్చనీయాంశంగా మారింది. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ముందుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం…

వైభవంగా మండల మహా కలశ స్థాపన

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 16: మండల కేంద్రంలోని శ్రీ సాయి మణికంఠ దేవాలయంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల మహాపూజ కార్యక్రమాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మహాగణపతి హోమంతో పూజలకు అంకురార్పణ చేశారు. ఆలయ పూజారి కొటారు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో తాంత్రిక విధానంలో మహాకలశం, అష్టాదశ కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహాకలశాన్ని అయ్యప్ప గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం కలశ జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అయ్యప్ప స్వాముల భజనలు, భక్తుల…