41 రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదానం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 16: మండల కేంద్రంలోని సుప్రసిద్ధ సాయి మణికంఠ ఆలయంలో అయ్యప్ప దీక్ష స్వాములకు 41 రోజుల పాటు నిత్య అన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్, మాజీ ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, గురుస్వామి వంగూరి లక్ష్మయ్య తెలిపారు. సోమవారం మండల మహాకలశ స్థాపన అనంతరం అన్నదాన కార్యక్రమానికి మాజీ పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు స్వామి రూ.90 వేల విలువైన 10 క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందించారు. డిసెంబర్ 27 వరకు ప్రతిరోజూ అన్నదానం కొనసాగుతుందని తెలిపారు. తొలి రోజు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న జన్మదినం సందర్భంగా వందమంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.

You may also like...