బొల్లెపల్లి ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 16 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ హక్కు బాధ్యతగా వినియోగించుకోవాలని మండలంలోని బొల్లెపల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్ధులకు వివరించారు. భవిష్యత్తులో ఓటర్లుగా మారనున్న విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియ. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటు వేసే విధానం, ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని మాక్ పోలింగ్ నిర్వాహకులు, ఉపాధ్యాయుడు చింత యాదగిరి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ స్వరూపారాణి, సర్పంచ్ వల్లపు వెంకటనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సరస్వతి, హెచ్ఎం ఏర్పుల నాగభూషణం, ఉపాధ్యాయులు షేరోజ్ దేశ్ముక్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

You may also like...